- తిరుపతి లడ్డూపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సివిల్ సూట్
హైదరాబాద్, వెలుగు: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు సిటీ సివిల్ కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. నవంబర్ 22న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొంది. పవన్ కల్యాణ్ తో పాటు తెలంగాణ సీఎస్ శాంతి కుమారి, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తాకి కూడా కోర్టు సమన్లు అందజే సింది. తిరుపతి లడ్డూ విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా నిరాధారమైన ఆరోపణలు చేశారని, ఇంటర్నెట్ లో ఉన్న వీడియోలను తొలగించాలని న్యాయవాది ఇమ్మనేని రామారావు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ సివిల్ సూట్ ను కోర్టు విచారించింది. బాధ్యులైన వారికి సమన్లు జారీ చేసింది.